* వోల్వో, బెంజ్, ఇంద్ర బస్సుల హల్‌చల్
* డొక్కు బస్సులను మార్చేస్తున్న సంస్థ
ప్రైవేట్‌తో పోటీకి RTC సై అంటోంది. వరల్డ్ క్లాస్ మల్టీ యాక్సిల్ ఓల్వోలతో రెడీ అయింది. ఓల్వో లే కాదు.. మెర్సిడెజ్ బెంజ్, AC బస్సులు ఇప్పుడు RTCకి న్యూలుక్ తెస్తున్నాయి. ఆర్ టి సి అంటే ఎర్రబస్సులనే నానుడిని చెరిపేసే ప్రయత్నం యాజమాన్యం చేస్తోంది.
డొక్కు బస్సులతో ప్రయాణికుల మన్నన కోల్పోయిన RTC.. ఇప్పుడు ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా కొత్త లుక్‌ను సంతరించుకుంటోంది. ఆసియా లోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రికార్డుల కెక్కిన ఆర్ టి సి వద్ద మొత్తం 22వేల బస్సులున్నాయి. వీటిలో నాలుగో వంతు బస్సులు కాలం చెల్లిపోవడంతో నిర్వహణా వ్యయం పెరిగి యాజమాన్యానికి తల బొప్పికడుతోంది.
ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. అసలు RTC బస్సుల్లో ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పడిపోయి RTC నిండా మునిగిపోయింది. రెండు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న సంస్థను గట్టెక్కించాలంటే వీటిని మార్చడమే మార్గమని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఆరు వేల డొక్కు బస్సులను వచ్చే యేడాది లోపే మార్చేయాలని చూస్తోంది.
ప్రభుత్వం అందించిన ఆర్ధిక సాయంతో ఇప్పటివరకూ రెండు వేల బస్సుల్ని కొనుగోలు చేసిన ఆర్టీసీ డిసెంబర్ కల్లా మరో రెండు వేలు, వచ్చే ఏడాది ఇంకో రెండు వేల బస్సులు కొనుగోలు చేసేందుకు రుణ హామీలు సంపాదించింది.
RTCకి గట్టిపోటీ ఇస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు అధునాతన ఓల్వో, బెంజ్, నిస్సాన్ బస్సుల్ని రోడ్లపైకి దించారు.
వారితో పోటీ పడలేకపోతున్న RTC పాత ఓల్వో బస్సులతోనే కాలక్షేపం చేస్తూ ప్రయాణికులను దూరం చేసుకుంది. రవాణా మంత్రి బొత్సా సత్యనారాయణ RTCకి అండగా నిలవడంతో సంస్థ కొత్త గెటప్‌ను సంతరించుకుంది. ప్రైవేటు ఆపరేటర్లతో పోటీకి సిద్దమంటోంది. ఓల్వో, బెంజ్, ఇంద్ర వంటి 20 AC బస్సుల్ని రంగంలోకి దించిన ఆర్ టి సి జనవరి కల్లా మరో నలభై బస్సుల్ని సిద్దం చేయనుంది.
ఎసి బస్సుల్ని RTCకి అద్దెకిచ్చేందుకు ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తే వాటిని తీసుకోవడానికి కూడా సిద్దమేనని రవాణా మంత్రి బొత్సా ప్రకటించారు.
సమ్మె దెబ్బతో వందల కోట్లు నష్టాన్ని కూడగట్టుకున్న RTC మూడొందల బస్సుల్ని ఒకేసారి ప్రవేశపెట్టడం ద్వారా పాసెంజర్స్‌కు దగ్గరవ్వాలని చూస్తోంది.
Thursday, 27 October 2011
//
Labels:
Cinema
//
0
comments
//
0 comments to "RTC New Look"
Powered by Blogger.
Labels
- Bikes (7)
- Cinema (100)
- dialogues (5)
- Ebook (5)
- English movies (62)
- English video songs (2)
- Fans designs (4)
- Games (54)
- gossips (4)
- Latest news (23)
- Movies (20)
- photo gallery (18)
- Rare images (13)
- Simple tricks (18)
- Softwares (145)
- Songs (17)
- telugu songs (3)
- Telugu video songs (3)
- WWE (1)
Post a Comment